ప్రజల కష్టాలను తెలుసుకోవడమే లక్ష్యం
** ఇంటింటికి టీడీపీలో ఎంపీ, ఎమ్మెల్యేలు
పలమనేరు(తిరుపతి): ఏడాది కాలంగా తమ కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా ఇంకా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని తెలుకునే లక్ష్యంతో ఇంటింటికి టీడీపీ చేపట్టామని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, పలమనేరు ఎమ్మెల్యే నూతనకాల్వ అమర్నాథ రెడ్డి తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వాళ్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల బ్రోచర్లను పంపిణీ చేశారు. పలమనేరు నియోజకవర్గం, వి.కోట మండలం, పడిగాల కుప్పం గ్రామంలో వారు మాట్లాడుతూ
మాది ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే సంక్షేమ ప్రభుత్వమని, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రగతిని చూసి ఓర్వలేకనే వైకాపా నాయకులు చిత్తశుద్ధితో పని చేస్తున్న కూటమి ప్రభుత్వం పై పసలేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. పనికట్టుకుని అసత్య ప్రచారాలు చేసే వైసిపి నేతల విమర్శలను సమర్ధంగా తిప్పి కొట్టాలని వారు టీడీపీ శ్రేణులుకు పిలుపునిచ్చారు. వి.కోట మండలాధ్యక్షుడు రంగనాథన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సమావేశానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా…, టిడిపి చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు సి.ఆర్.రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే ఏ.యస్.మనోహర్,
చూడా ఛైర్పర్సన్ కఠారి హేమలత, అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా వారంతా… పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజా ప్రతినిధిగా ఆయన ప్రజలకు అందిస్తున్న సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు.
2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు పరచిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పార్లమెంటును పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దడమే తమ ముందున్న ప్రధమ కర్తవ్యమన్నారు.
ఐతే…తమ మనుగడ కోసం వైసిపి..ప్రజాభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మా మంచి ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించరని.. భవిష్యత్తులో వైకాపాకు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారని వారు తెలిపారు.
