
పేదోడి ఆకలి తెలిసిన ప్రభుత్వం మన ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా 207 అన్నా క్యాంటీన్లు
కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే యన్ టి ఆర్ సిద్ధాంతిమే తెలుగుదేశం పార్టీకి గట్టి పునాది అని ఆశయాలు సాధనలో భాగమే పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు తిరిగి మల్లి తిరిగి ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. కోవూరులో నూతనంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లో ప్రశాంతి రెడ్డి వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ. గత వైసిపి ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టే ఇలాంటి దేవాలయాలను మూసివేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 207 అన్నా క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తెచ్చారన్నారు.
అన్నిచోట్ల అన్న క్యాంటీన్లు ఉన్నాయి. కోవూరు నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ఉండాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి దీనిని ఏర్పాటు చేశామన్నారు. 5 రూపాయలకి పేదవారికి నాణ్యమైన రుచికరమైన భోజనం అందించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. ఈ క్యాంటీన్ వల్ల ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరుతుందన్నారు. తనపై నమ్మకంతో పొలిట్ బ్యూరో సభ్యురాలుగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, సాయి తేజ రెడ్డి, దారపనేని శ్రీనివాస్ నాయుడు, బత్తల రమేష్, బీదా భాస్కరరావు, పాలూరు వెంకటేశ్వర్లు, బెల్లంకొండ విజయ్, గాదిరాజు అశోక్, పిచ్చుక మధుసూదన్ రావు, యద్దలపూడి నాగరాజు, దాసరి మురళి, ఏకశిరి వెంకటరమణమ్మ, పబ్బారెడ్డి మల్లికార్జున్ రెడ్డి, సాయి జయంత్ రెడ్డి, పాలూరు బాలకృష్ణ, షేక్. జమీర్, షేక్. జహంగీర్, బిజెపి మండల అధ్యక్షుడు పోలిశెట్టి సుబ్బారావు, జనసేన చప్పిడి శ్రీనివాసులురెడ్డి, మరియు కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.