
వైవిధ్య పంటల సాగుతో సుస్థిర వ్యవసాయానికి బాటలు వేయండి.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
గుంటుపల్లిలో రైతన్నా మీకోసం.
ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనూరాధ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం,
రైతులు వైవిధ్య పంటల సాగుతో సుస్థిర వ్యవసాయానికి బాటలు వేసి అధిక దిగుబడి, నికరాదాయం పొందాలని
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు సూచించారు. ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ వారికి పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాన్ని అమలుచేస్తోందన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షురాలు గద్దె అనూరాధ తో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు రైతన్నా మీకోసం కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి శ్రేణులతో కలిసి ‘రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం’ పేరుతో రైతులకు కరపత్రాలు పంపిణీ చేశారు. నీటి భద్రత, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతి కత, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ రిజర్వాయర్లలో నీరు ఉన్న నేపథ్యంలో మే 15 నుంచి ముందస్తు సాగు మొదలు పెట్టాలి. దీనివల్ల అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంది. అందువల్ల నీటిని పొదుపుగా వినియోగించాలన్నారు.
కృత్రిమ మేథ(ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. సహజ పద్ధతుల్లో సేంద్రీయ ఎరువులతో పంటల సాగుతోనే రైతులు తమ పొలాలలో ఆరోగ్యవంతమైన పంటల దిగుబడులు సాధించవచ్చన్నారు.
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు రాయితీ కింద కిసాన్ డ్రోన్ల యంత్రాలు, రైతులు పండించే ధాన్యం సేకరించడం, బిందు, తుంపర సేద్యాన్ని విస్తరింప చేయడం, సన్న, చిన్న కారు రైతులకు రాయితీలను అందించడంతో పాటు పంట నాణ్యత గణనీయంగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
వ్యవసాయ అనుబంధ శాఖల పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తూ క్షేత్రస్థాయిలో రైతు సమస్యలు పరిష్కరించడానికి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ రైతులను అన్ని విధాల ఆదుకుని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన రైతులకు సూచించారు.
తుమ్మలపాలెం ఎత్తిపోతల పథకం విద్యుత్తు బిల్లుల బకాయి సమస్యను ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఖాజీమాన్యం, రెవెన్యూ సంబంధిత దీర్ఘకాలిక సమస్యలను కూడా ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదు గారి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అమరావతి రాజధాని మన మైలవరం ప్రాంతానికి కూడా వరమన్నారు. జల్ జీవన్ పథకంకు కేంద్రం 11,500 కోట్ల నిధులు కేటాయించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , కూటమి నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.