
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి
పెద్దపల్లి రామగుండం పోలీస్ కమీషనరేట్ గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 ఇంక్లైన్ వద్ద ఉన్న ఈద్గ ను సందర్శించి, బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులకు డిసీపీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్బంగా డిసీపీ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం శాంతి, సహనం, దయ, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సమాజంలో ప్రశాంతమైన శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఉపవాస దీక్షల ద్వారా సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు. రంజాన్ పర్వదినాన్ని శాంతియుతంగా జరుపుకునేలా పోలీస్ శాఖ అన్ని విధాలుగా బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, పరస్పరం సహకరించి పండుగను ఆనందంగా జరుపుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
డిసిపి వెంట గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, ఎస్ ఐ లు ఉన్నారు.