
చిలకలూరిపేటలో భక్తిశ్రద్ధలతో రంజాన్..
చిలకలూరిపేట: పట్టణంలో రంజాన్ వేడుకలు వైభవంగా జరిగాయి.నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం స్థానిక ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాదిగా తరలివచ్చి సామూహిక నమాజ్ నిర్వహించారు. మతగురువుల నేతృత్వంలో దేశ శాంతి,సౌభాగ్యాల కోసం ప్రత్యేక దువా చేశారు.అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ తెలుపుకున్నారు. హిందూ సోదరులు సైతం శుభాకాంక్షలు తెలపడంతో పట్టణంలో మతసామరస్యం వెల్లివిరిసింది. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రార్థనలకు పక్కా ఏర్పాట్లు చేశారు.