ఆసుపత్రిలో అందే వివిధ వైద్య చికిత్సలను ప్రజలు వినియోగించుకోవాలి…

TEJA NEWS

ఆసుపత్రిలో అందే వివిధ వైద్య చికిత్సలను ప్రజలు వినియోగించుకోవాలి…

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….

పెద్దపల్లి/
ఆసుపత్రిలో అందే వివిధ వైద్య చికిత్సలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

పెద్దపల్లి పట్టణంలో ఉన్న జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 24 లక్షల రూపాయలతో కంటి శస్త్ర చికిత్స విభాగంలో నూతనంగా కొనుగోలు చేసిన ఫాకో యంత్రం పని తీరు వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.

కంటి శస్త్ర చికిత్స లను అత్యాధునిక పద్ధతుల్లో విజయవంతంగా చేసేందుకు వినియోగించే ఈ ఫాకో యంత్రం పెద్దపెల్లి జిల్లాలోలోనే ప్రథమంగా ప్రభుత్వ ఆసుపత్రిలోఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన ప్రజలు దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ లో లభించుచున్న యూరాలజీ సేవలు, లాప్రోస్కోపిక్ సర్జరీ సేవలు , హిస్టెరెక్టమీ, డెలివరీలు, స్కానింగ్ మరియు టిఫా స్కానింగ్ , రూట్ కెనాల్ చికిత్స సేవలు, నవ జాతి శిశు కేంద్రం సేవలు, ఆర్థో సర్జరీ సేవలు , ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ సేవలు, 2D ఎకో సేవలు, డయాలసిస్ సేవలు, కంటి సంబంధిత ఫాకో సర్జరీ సేవలు, టి హబ్ సేవలు పూర్తి స్థాయిలో ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, కంటి శస్త్ర చికిత్స నిపుణులు డా సబిహా సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top