సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణం.

TEJA NEWS

పల్నాడు: సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణం…ఫోరెన్సిక్ నిపుణులు
పల్నాడులో జూన్ 18న వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రయాణించిన వాహనమే దళితుడు సింగయ్య మృతికి కారణమని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. గతంలో మార్ఫింగ్ వీడియోలని అని వైకాపా నేతలు ఆరోపించినప్పటికీ ఫోరెన్సిక్ విభాగం సెల్ఫోన్లలో రికార్డ్ అయిన వీడియోలు ఒరిజినల్స్ అని తేల్చింది. ఘటనా స్థలంలో డ్రోన్, సీసీ కెమెరాల ఫుటేజీ, ర్యాలీని చిత్రీకరించిన వైకాపా కార్యకర్తల ఫోన్లను ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. 6 ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించగా అవన్నీ ఒరిజినల్వేనని స్పష్టమైంది.తరువాత ఏమి చర్యలు చేబడతారు అనేది వేచి చూడాలి

You cannot copy content of this page

Scroll to Top