కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూల స్పందనతో బాచుపల్లి ప్రాంతం కాకతీయ నగర్ కాలనీలో మంజూరు చేయించారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ రోడ్డు నిర్మాణంతో కాకతీయ నగర్ కాలనీలో వాసులకు, విద్యార్థులకు మరియు రాకపోకలకు పెద్ద ఎత్తున ఉపశమనం కలగనుంది.

అనంతరం కాకతీయ నగర్ కాలనీ వాసులు, ఈ అభివృద్ధి పనులకు చొరవ చూపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమంతన్న కి, అలాగే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ వీరేందర్ రెడ్డి, కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, జిత్తు, రాజేందర్, కాలనీ వాసులు రవి కృష్ణ, రమేష్ కోటి, దశరథ మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top