యోగాభ్యాస ఫలితాలు ప్రజలకు తెలియచేయండి : ప్రత్తిపాటి

TEJA NEWS

యోగాభ్యాస ఫలితాలు ప్రజలకు తెలియచేయండి : ప్రత్తిపాటి

సామాన్యులు..ముఖ్యంగా మహిళలు యోగా విశిష్టత తెలుసుకోవాలి :ప్రత్తిపాటి.
నిత్యం యోగాను అభ్యసించడం వల్ల శరీరంలో కలిగే మార్పులు.. ఫలితాల గురించి ప్రజలు తెలుసుకోవాలని, ముఖ్యంగా మహిళలు యోగాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఆ విద్య యొక్క విశిష్టతను సామాన్యులకు అర్థమయ్యేలా వివరించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. విశాఖలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు క్యాంప్ కార్యాలయంలో యోగాంధ్ర నిర్వహణపై మంత్రులు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్ లు, మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, చైర్మన్ ప్రణయ్ గోపాల్, అధికారులు.. స్థానిక వార్డు నాయకులతో నిర్వహించిన సమీక్షలో ప్రత్తిపాటి పాల్గొన్నారు.

సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ… ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి యోగాను ఎందుకింతగా ప్రజలకు చేరువచేయడానికి ప్రయత్నిస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. సామాన్యులు.. ముఖ్యంగా మహిళలు యోగాపై ఆసక్తి పెంచుకొని ఆచరణలో పెడితే ప్రజల్లో దానిపై సహజంగానే ఆసక్తి కలుగుతుందన్నారు. అప్పుడే ప్రభుత్వం తలపెట్టిన యోగాంధ్ర లక్ష్యం నెరవేరుతుందని ప్రత్తిపాటి చెప్పారు. ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతగా ఉపయోగపడుతుందో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని, అప్పుడే భారతీయ సంప్రదాయ విద్యకు నిజమైన సార్థకత లభిస్తుందన్నారు.

You cannot copy content of this page

Scroll to Top