పల్లె ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం

TEJA NEWS

పల్లె ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం

సమిష్టి కృషితో మెదక్ లో 70 శాతనికి పైగా కాంగ్రెస్ కైవసం

కార్యకర్తల కష్టంతో అద్భుత ఫలితాలు

బిఆర్ఎస్ చిల్లర రాజకీయాలకు గుణపాఠం చెప్పిన ప్రజలు

రాబోయే ఎన్నికల్లోనూ రెట్టింపు హవా కొనసాగిస్తాము

ఎవరు గెలిచిన అభివృద్ధి చేస్తాం.. అన్ని గ్రామాలను సమానంగా చూస్తాం

మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు

మెదక్

పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఫలితాలు ప్రభుత్వ పనితీరు కు నిదర్శనమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు తెలిపారు.బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయన విలేకర్లతో మాట్లాడారు. మెదక్ నియోజకవర్గం లో 70 శాతనికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని,కార్యకర్తలు కష్టంతో అద్భుత ఫలితాలు సాధించమన్నారు. వారి కష్టాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానన్నారు.పంచాయితీ ఎన్నికల్లో విజయం గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతమని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనపై జనం ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, పల్లెజనం ఇచ్చిన ఈ తీర్పుతో తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.

గత రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు చేరడం వల్లే ఈ సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, రైతులు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపే నిలిచారని, సామాజిక న్యాయం అనే నినాదానికి పట్టం కట్టారని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేందుకు, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పని అయిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, చిల్లర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ కు ఇప్పటికే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ మనుగడే కరువవుతుందని విమర్శించారు.

నూతనంగా ఎన్నికైన సర్పం చులు, వార్డు సభ్యులు గ్రా మాల అభివృద్ధి కోసం కృషి చేయాలని,గెలిచిన వారు గొప్పలకు పోకుండా.. ప్రతి ఒక్కరినీ కలుపుకుని గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.ప్రభుత్వం దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.నియోజకవర్గం లో జరిగిన రెండు విడతల్లోనూ.. కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని పేర్కొన్నారు. 70 శాతానికి పైగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు. ప్రజాపాలనలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రతి సర్పంచ్ రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తే నాయకుడు కాలేడన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, విద్యా, వైద్య రంగాలపై సర్పంచులు దృష్టి సారించాలని, వీటిపై నిత్యం సమీక్షించాలని సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top