నల్లవల్లిలో 144 సెక్షన్ అమలు

TEJA NEWS

నల్లవల్లిలో 144 సెక్షన్ అమలు
పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్‌పై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనలు చేపట్టడంతో, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు నల్లవల్లిలో 144 సెక్షన్‌ను పోలీసులు అమలు చేశారు.
ఈ నేపథ్యంలో, గ్రామస్థులను పరామర్శించేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. దీంతో ఆందోళన దారులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషనులకు తరలిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top