వనపర్తి వర్తక సంఘం ఆధ్వర్యంలోగాంధీ విగ్రహనికి స్టీల్ మెట్లు, సోలార్ లైటింగ్ ఏర్పాటు

TEJA NEWS

వనపర్తి వర్తక సంఘం ఆధ్వర్యంలోగాంధీ విగ్రహనికి స్టీల్ మెట్లు, సోలార్ లైటింగ్ ఏర్పాటు
వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలోనీ
గాంధీచౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మెట్లు, రక్షణగా ముందర స్టీల్ పైపులు వర్తక సంఘం పేరుతో ఏర్పాటు చేయడం తొ పాటువిగ్రహానికి సోలార్ లైటింగ్ కూడా పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది సమాజ శ్రేయస్సు కోరే ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రారంభించడం ఆనవాయితీ అలాంటి మహాత్ముడి విగ్రహానికి మెట్లు లేకపోవడంతో ఆయనను స్మరించుకోవడం ఇబ్బందికరంగా మారడంతో స్పందించిన పట్టణవర్తక సంఘం సభ్యులు విగ్రహం వద్ద స్టీల్ మెట్లను ఏర్పాటు చేయడం సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం పట్ల ఆర్యవైశ్యుల తో పాటు రాజకీయ నాయకులు సమాజ సేవకులు ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు

You cannot copy content of this page

Scroll to Top