కొండవీడు ఉత్సవాలతో రాష్ట్ర ఖ్యాతి జాతీయస్థాయిలో ఇనుమడించాలి

TEJA NEWS

కొండవీడు ఉత్సవాలతో రాష్ట్ర ఖ్యాతి జాతీయస్థాయిలో ఇనుమడించాలి : మాజీమంత్రి ప్రత్తిపాటికి సీఎం సూచన

రాత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కొండవీడు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను వివరించిన ప్రత్తిపాటి.

  • నియోజకవర్గ సమస్యల పరిష్కారం.. అభివృద్ధి నిధుల కేటాయింపుపై చొరవ చూపాలని సీఎంను కోరిన ఎమ్మెల్యే.
  • తెలుగునాటక పరిషత్తుల సమ్మేళన సంఘం – యడ్లపాడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా -ఢిల్లీ వారి సంయుక్త సారథ్యంలో భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవాల ప్రచార పత్రాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, ప్రత్తిపాటి.

చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన కొండవీడు కోట సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ రాష్ట్రం గర్వించేలా, ఏపీ ఖ్యాతి జాతీయస్థాయిలో ఇనుమడించేలా అంగరంగవైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

రాత్రి ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి కొండవీడు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల గురించి తెలియచేసినట్టు ప్రత్తిపాటి చెప్పారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించే ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి, భారీసంఖ్యలో తరలివచ్చే పర్యాటకులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల సమస్వయంతో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారని ప్రత్తిపాటి చెప్పారు. కొండవీడు మార్గంలో చౌడవరం వద్ద రూ.220కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన టన్నెల్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలన్న విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

నాటకోత్సవాల ప్రచార పత్రాలు ఆవిష్కరించిన సీఎం
తెలుగునాటక పరిషత్తుల సమ్మేళన సంఘం – యడ్లపాడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా -ఢిల్లీ వారి సంయుక్త సారథ్యంలో ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు గుంటూరులో జరిగే భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం ప్రచార పత్రాలను ముఖ్యమంత్రి స్వయంగా ఆవిష్కరించారని ప్రత్తిపాటి తెలియచేశారు. ఈ సందర్భంగా గుంటూరులో జరిగే నాటకోత్సవాలకు నిర్వాహకులు, తాను ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. తెలుగునాటక పరిషత్తుల సంఘం నిర్వాహకులు ముత్తవరపు సురేశ్ బాబు సమాజశ్రేయస్సు, ప్రజాచైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏటా ఘనంగా నిర్వహించే నాటకమహోత్సవాల విశిష్టతను సీఎం కు వివరించారని, సురేశ్ కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారని ప్రత్తిపాటి తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top