ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ నరసింహ

TEJA NEWS

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట జిల్లా : ఈరోజు నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నారాయణ జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కలశాల పరీక్షా కేంద్రాలను ఎస్పి నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేద ఆజ్ఞలు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపినారు. పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. నిషేధ ఆజ్ఞలు ఉన్నందున పరీక్ష కేంద్ర పరిసరాల్లో లౌడ్ స్పీకర్లు, మైకులు, వాహన హరన్ లు ఉపయోగించరాదని కోరారు, జిరాక్స్ సెంటర్స్, ఇంటర్నెట్ కేంద్రాలు మూసివేయాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పి వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ లు శివ తేజ, మహెంద్రనాధ్, ఎగ్జామినేషన్ సిబ్బంది ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top