నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక పులకరింత

TEJA NEWS

నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక పులకరింత

** గుండాల గోపినాథ్ నేతృత్వంలో భజనలు
తిరుపతి: ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మార్మోగుతున్నాయి.. శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. వందమందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకే సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తు నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు.

నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు విజయ కుమారి, అమరావతి, రేవతి, ఉమా, జి పద్మ, వై.పద్మావతి, ధనమ్మ, శ్రావణి, జయమ్మ, అరుణమ్మ, సిద్ధమ్మ పార్వతి, రామకృష్ణారెడ్డి, మునప్పగారి మునినాధ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఎల్.కృష్ణయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, మేకల గంగయ్య, మధు, వాసుదేవ రెడ్డి, నరసింహారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మురళి తొండమునాటి సుబ్రహ్మణ్యం, తులసి రామ్ నాయుడు, వెంకట్రామయ్య, నాగేశ్వర్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, నాగరాజు, చంద్రబాబు నాయుడు, కన్నప్ప కేశవులు, మల్లారపు వాసు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top