క్షత్రియ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు

TEJA NEWS

క్షత్రియ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు

** అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీధర్ రాజు, రవిరాజు

** వెల్లడించిన చీఫ్ కో-ఆర్డినేటర్ భాను ప్రసాద్ రాజు
….

తిరుపతి / పుత్తూరు: తిరుపతి జిల్లా క్షత్రియ వివాహ పరిచయ వేదిక అధ్యక్ష కార్యదర్శులుగా పుత్తూరుకు చెందిన ప్రముఖ డాక్టర్లు శ్రీధర్ రాజు, డాక్టర్ రవిరాజులను నూతనంగా నియమించినట్లు క్షత్రియ వివాహ పరిచయ వేదిక చీఫ్ కో-ఆర్డినేటర్ భాను ప్రసాద్ రాజు వెల్లడించారు. శనివారం పుత్తూరులోని సుభాషిని ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ క్షత్రియ రాజులలో ఉన్న గోత్రాలకు సంబంధించి క్షత్రియ పెద్దలను నియమించి వారి ద్వారా వివాహ బంధాలను పెంపొందించి పెళ్లిళ్లు హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.క్షత్రియ వశిష్ట, ధనంజయ గోత్ర పెద్దలుగా యువరాజు, కోనేటిరవి రాజు లను నియమించారు.

నూతనంగా పుత్తూరులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నియమ నిబంధనలతో బైలాను రూపొందించి పెద్దల సమక్షంలో వధూవరుల పరిచయ కార్యక్రమాన్ని నేరుగా ముఖాముఖి ద్వారా చర్చించి వివాహాలు జరిగేలా సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కోశాధికారిగా జగదాభి గోపిరాజును నియమించినట్లు ప్రకటించారు. పూర్తి కార్యవర్గాన్ని నియమించి సొసైటీ యాక్ట్ మేరకు రిజిస్ట్రేషన్ జరిపి కార్యకలాపాలను త్వరలో ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో వీరితో పాటు డాక్టర్ శుభాషిణి, రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ సహాయ కార్యదర్శి, శ్రీ కామధేను గో సంరక్షణ సమితి ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, క్షత్రియ పెద్దలు యువరాజు, అఖిల భారతీయ క్షత్రియ మహాసభ అధ్యక్ష కార్యదర్సులు కోనేటి రవిరాజు, చంద్రశేఖర్ రాజు, అఖిల భారత క్షత్రియ మహాసభ యూత్ అధ్యక్షులు బాలసుబ్రమణ్యం రాజు, ఆర్గ నైసింగ్ కార్యదర్శి చంద్రబాబు, ఆనందరాజు, బీఎస్ఎన్ఎల్ వై.ఎస్.రాజు, భాస్కర్ రాజు, నరసింహ రాజు, ప్రభాకర్ రాజు తదితర క్షత్రియులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top