రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, గాయపడిన వ్యక్తిని బైక్ పై ఆసుపత్రికి తరలించిన ఎస్సై
వనపర్తి, : రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న సంఘటన
వనపర్తి జిల్లా నర్సింగాయపల్లి డిగ్రీ కళాశాల సమీపంలో ఉదయం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదంలో
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి రోడ్డుపైనే పడి ఉన్న వ్యక్తిని అదే సమయంలో గోపాల్పేట నుండి వనపర్తికి బైకుపై వస్తున్నా జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్సై నరేష్ ప్రమాదాన్ని గమనించి అంబులెన్స్ తక్షణం అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితిని గ్రహించిన ఆయన, గాయపడిన అతన్ని తన బైక్‌పై స్వయంగా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రమాదం తప్పింది
ఎస్సై నరేష్ చూపిన చొరవకు “శభాష్ పోలీస్” అంటూ స్థానికులు ప్రశంసలు కురిపించారు.
