శోభయామానంగా విగ్రహా ప్రాణప్రతిష్ట.. పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

TEJA NEWS

శోభయామానంగా విగ్రహా ప్రాణప్రతిష్ట.. పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో… శ్రీ షిర్డి సాయినాథ, మార్కండేయ స్వామి మరియు సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

శేరిలింగంపల్లి డివిజన్… రాజీవ్ గృహకల్పలో ఆధ్యాత్మిక చింతనతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, శేరిలింగంపల్లి అభివృద్ధికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించినటువంటి ఆలయం వైభవోపేతంగా ప్రారంభమైంది.

మూడు రోజుల నుంచి జరుగుతున్న ఉత్సవాలు.. చివరి అంకానికి చేరుకున్నాయి. ఉదయం నుంచే రిత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ యజ్ఞశాలలో హోమాలు నిర్వహించారు. పలు పూజా క్రతువులను పూర్తి చేసిన రుత్వికులు ప్రధాన ఆలయాలతో పాటు.. ఉపాలయాల గోపురాలపై కలశ ప్రతిష్ట చేపట్టారు.

అనంతరం శ్రీ షిర్డి సాయినాథ, మార్కండేయ స్వామి మరియు సంతాన నాగదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దేవ దేవతల పాదాలచెంద బీజాక్షర బంగారు యంత్రాన్ని ఉంచడంతోపాటు.. పీఠంపై విగ్రహాలను ప్రతిష్టించారు.

యజ్ఞశాలలో పలు పూజా క్రతువులు నిర్వహించిన వేద పండితులు కలశాల ద్వారా దేవదేవులకు ప్రాణ ప్రతిష్ట చేశారు.

అనంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహించి అలంకరణ పూర్తి చేసి సాధారణ భక్తులకు దర్శన అవకాశం కల్పించారు.

ఉత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరు దైవచింతన అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ చారిత్రాత్మక వేడుక మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంకేతంగా నిలిచిందని అన్నారు. ఆ భగవంతుడుకీ సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని.. జన్మ ధన్యుడినని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా నాయకులు స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిపించుకున్నామని అందుకు మా ప్రాంతం మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పరిచారని.. అలాగే తన సొంత ఖర్చులతో బడి నిర్మించి ఎందరో పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని.. మాకోసం మరెన్నో సేవ కార్యక్రమాలు చేశారని.. అందులో భాగంగా ఒక గొప్ప సంకల్పంతో తన సొంత ఖర్చులతో అన్ని హంగులతో సకల సౌకర్యాలతో, ప్రశాంతత వాతారణంలో ఆలయం నిర్మించి.. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని కొనియాడారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ.. సాయిబాబా ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని అలాగే భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అనంతరం అన్న ప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు వడ్డీంచారు.

ఈ కార్యక్రమంలో పురప్రముఖులు, సీనియర్ నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top