అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
విజయవాడ దుర్గగుడి,
శ్రీ అమ్మవారి దర్శనముకు వెళ్లే ముందు భక్తులతో మాట్లాడిన మంత్రి.
ఆన్ లైన్ సేవలు, భక్తుల సంతృప్తి స్థాయి తెలుసుకున్న మంత్రి.
అన్ని ఏర్పాట్లు బాగున్నాయని తెలిపిన భక్తులు.
మంత్రికు వేద మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ బొర్రా రాధా కృష్ణ (గాంధీ), ఈవో శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు.
శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు.
అనంతరం ఈవో ఛాంబర్లో – దేవాలయంలో నగదు రహిత సేవల స్థాయి, ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారా భక్తుల సంతృప్తి స్థాయి, ఆన్ లైన్ సేవలు పెంపుదల గురించి ఆలయ ఈవో నుండి వివరాలు తెలుసుకున్న మంత్రివర్యులు.
ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో ఆన్ లైన్ సేవలు భక్తులకు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు బడేటి ధర్మారావు, పి. రాఘవ రాజు, ఎ. శ్రీనివాసరావు, సుకాసి సరిత
అవ్వారు బుల్లబ్బాయి, సుకాసి సరిత
ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు తదితరులు పాల్గొన్నారు.
