ఒకే రోజు ఓకే మండలం లో ఇద్దరు రైతుల ఆత్మహత్య

TEJA NEWS

ఒకే రోజు ఓకే మండలం లో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక నాదెండ్ల మండలంలో నిన్న ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డారు. తూబాడులో ఒకరు, నాదెండ్లలో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇద్దరూ వ్యవసాయ క్షేత్రాల్లో పురుగుల మందు తాగి చనిపోయారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం
తూబాడు రైతు పేరు
చిరుబోయిన గోపాలరావు (సుమారు 40 సంవత్సరాలు).
నాదెండ్ల రైతు పేరు
నస్యం ఆదినారాయణ (సుమారు 45 సంవత్సరాలు).
వీరు ఇరువురు కౌలు రైతులని కౌలుకు పొలాలు వేసి దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వీరిరువురి మృతదేహాలను శవపంచనామా నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు దీనిపై నాదెండ్ల యస్. ఐ. పుల్లారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

You cannot copy content of this page

Scroll to Top