బ్రిటిష్ హై కమిషనర్ ను కలిసిన టీసీసీ ప్రతినిధులు

TEJA NEWS

బ్రిటిష్ హై కమిషనర్ ను కలిసిన టీసీసీ ప్రతినిధులు

తిరుపతి: తిరుపతి పర్యటనకు విచ్చేసిన బ్రిటిష్ వాణిజ్య విభాగపు హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ను తిరుపతి జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్(టీడీసీసీ) అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాయలసీమ జోన్ చైర్మన్ కె.వి.చౌదరి (బాలాజీ రెసిడెన్సీ అధినేత) ఆధ్వర్యంలో ప్రతినిధులు మంగళవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ తరపున బ్రిటిష్ హై కమిషనర్ ను శాలువాలు కప్పి, శ్రీవారి ప్రతిమలు ఇచ్చి సత్కరించడం జరిగింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన సాఫ్ట్ వేర్ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారస్తులను కలిశారు. ఈ సందర్భంగా బ్రిటిష్ హై కమిషనర్ మాట్లాడుతూ బ్రిటన్ లో వ్యాపారములు స్థాపించి, అభివృద్ధి చేయాలని కోరారు. వ్యాపారస్తులకు ఇవ్వబడినటువంటి అన్ని రకాల సౌకర్యాలను వివరముగా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో రాయలసీమ జోన్ చైర్మన్ అండ్ జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె.వి.చౌదరి, ముండ్లూరు సూర్య, హోటల్ సింధూరి పార్క్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, శశిధర్ బాబు, సిఐఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు విజయ్ గల్లా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top