ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన టిడిపి ముస్లిం శ్రేణులు షంషూర్, హాజీ గౌస్

TEJA NEWS

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన టిడిపి ముస్లిం శ్రేణులు షంషూర్, హాజీ గౌస్

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పామూరు టిడిపి ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ షంషూర్, షేక్ హాజీ గౌస్ బూత్ ఇంచార్జ్ సలాం ఖాజా మొహిద్దిన్, సచివాలయం ఉద్యోగస్తులు కళ్యాణి మేడం సారధ్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షంషూర్ మాట్లాడుతూ ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నామని పేదల పట్ల టిడిపి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కోట్లాది రూపాయలతో సామాజిక పెన్షన్ల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే వృద్ధులకు 4000, వికలాంగులకు 6000, కిడ్నీ ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000, మంచానికే పరిమితమైన వారికి 15000 అత్యధిక మొత్తంలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందించి ఆ కుటుంబాలకు సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సలాం ఖాజా మొహిద్దిన్ షేక్ రఫీ, షరీఫ్ తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top