అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి…

TEJA NEWS
  • అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి…
  • ఈద్-ఉల్-ఫితర్ పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
  • ఈద్-ఉల్-ఫితర్ (ప‌విత్ర రంజాన్) ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగల్లో ఒకటి రంజాన్ అని కొనియాడారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని అన్నారు.ఈ పవిత్ర మాసం దీక్ష‌లు , ప్రేమ‌, ద‌య సౌభ్రాతృత్వ గుణాల‌ను పంచుతుంద‌ని పేర్కొన్నారు.గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని అన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు. కుల మతాలకతీతంగా ఒకరి పండుగలను మరొకరు సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకునే సంస్కృతి మన తెలంగాణ వారిది అని అన్నారు.ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top