2026-27 : తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా

TEJA NEWS

2026-27 : తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..

Budget 2026-27 : తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి..

ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ 2026-27ను 3,24,234 కోట్లుతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లు కాగా.. మూలధన వ్యయం 47,267 కోట్లుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ప్రస్తుతం 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి మూడు ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.

బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

వ్యవసాయం-రూ.23,179 కోట్లు
విద్యుత్‌శాఖ-రూ. 21,285 కోట్లు
విద్యాశాఖ-రూ.26,674 కోట్లు
మహిళ, శిక్ష సంక్షేమం-రూ.3143 కోట్లు
పశుసంవర్థకశాఖ-రూ.1,529 కోట్లు
సివిల్‌ సప్లై-రూ.7,366 కోట్లు
వైద్యారోగ్యశాఖ- రూ.13,679 కోట్లు
రాజీవ్‌ యువవికాసం- రూ. 6000 కోట్లు
ఎస్సీ అభివృద్ధి- రూ.11784 కోట్లు
ఎస్టీ అభివృద్ధి రూ.7937 కోట్లు
మైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లు
బీసీ సంక్షేమం : రూ.12,511 కోట్లు
ఇరిగేషన్ -రూ.22615 కోట్లు
మున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లు
గృహ నిర్మాణం- రూ.7430 కోట్లు
ఐటీ- రూ.875 కోట్లు
చేనేత- రూ.258 కోట్లు
పరిశ్రమలు- రూ. 3490 కోట్లు
పంచాయతీ రాజ్- రూ.33688 కోట్లు
ఆర్‌అండ్‌బీ – రూ.12789 కోట్లు
న్యాయ శాఖ- రూ.2367 కోట్లు
హోంశాఖ- రూ. 11907 కోట్లు
టూరిజం- రూ. 1224 కోట్లు
గోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం :

ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించనున్నారు. కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం దజేస్తారు. పేద, ధనిక అనే తేడా లేకుండా కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

You cannot copy content of this page

Scroll to Top