ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి లక్ష్యం
- పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
-జనసేన కేంద్ర కార్యాలయం వద్ద ప్రజల నుంచి వినతుల స్వికరణ
మంగళగిరి:
ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి కార్యక్రమం లక్ష్యమని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సోమవారం జరిగిన జనవాణి -జనసేన భరోసా కార్యక్రమంలో ఆయన జనసేన పార్టీ నేతలతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా మంగళగిరి కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. ఎటువంటి సమస్య అయినా జనవాణి ద్వారా పరిష్కారం అవుతుందనే సదుద్దేశంతో
ఎంతోమంది తమ సమస్యలను అర్జీ రూపంలో నాయకులకు తెలియజేస్తున్నారని, ఆ సమస్యలను కార్యక్రమంలో పాల్గొనే నాయకులు తక్షణ పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నో విధాలుగా ప్రయత్నించినా పరిష్కారం కానీ సమస్యలు జనవాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించబడటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, పార్టీ లీగల్ సెల్ వరగాని శివశంకర్ చౌదరి, శాలం శ్రీనివాస రాజా, జనసేన నాయకులు కంకణాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
