ఎమ్మెల్యే మందుల సామెల్ పై దాడి అనగరికం.
సిపిఐ,దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పై ఆర్ ఎస్ ఎస్,బీజేపీ గుండాల పై దాడిని నిరసిస్తూ నేడు జగతగిరిగుట్ట లాస్ట్ బస్టాప్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మందుల శామ్యూల్ పైన ఆర్ఎస్ఎస్ మరియు బిజెపి నాయకులు పరుష పదజాలంతో తిట్టుకుంటూ ఇంటిపైన దాడి చేయడం అనాగరికమైన చర్యని జైశ్రీరామ్ అంటూ లంజాకొడకా అని తిట్టడం జై హిందూ మతం అంటూ ఎవరికి పుట్టినావు రా అని తిట్టడం అనేది వారి అహంకారానికి నిదర్శనం అని ఇది రాష్ట్రంలో బిజెపి చేస్తున్నటువంటి కుల రాజకీయాలని బ్రాహ్మణులను తిడితే మొత్తం హిందూ మతాన్ని తిట్టినట్టు ప్రచారం చేసుకోవడం ఈ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడమేనని ఇలాంటి సంఘటనలు జరగడం వెనకాల మనువాద గుండాల హస్తముందని దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళ మాటలు కూడా తోడ్పాటు ఇస్తున్నాయని మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని విద్వేషాలకు పెంచుతున్నటువంటి బిజెపి ఆర్ఎస్ఎస్ ఈ సంఘటనతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది.
హిందూ మతం పేరుతోటి దాడులు చేయడం మతాన్ని రాజకీయంగా వాడుకోవడం, హిందూ మతం అంటే కేవలం బిజెపి అన్నట్టు ప్రచారం చేసుకోవడం హిందూ మతాన్ని కించపరచడమేనని బండి సంజయ్ ఈ కుట్ర దాడి వెనకాల ఉన్న వారందరూ రాష్ట్రంలోని దళిత బహుజనులకు క్షమాపణలు చెప్పాలని, దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బెయిల్ రాకుండా చేయాలని లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజనులతో పాటు సిపిఐ కూడా బిజెపికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ముందుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, సీనియర్ నాయకులు లింగయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న మాదిగ జర్నలిస్టు నాయకులు రామస్వామి తొండ వెంకట్ గణేష్ నరేష్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు బాబు వల్లూరి బాబు,వెంకటేష్ సోమయ్య, హిందూ బిసి మహాసభ నాయకులు నరహరి, జై భీమ్ నాయకులు అల్వాల భాస్కర్,పరుశరాములు అశోక్ అరుణ్ సిపిఐ నాయకులు ఇమామ్,ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.
