ఇంతకుముందు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెసే , రేపు ప్రాజెక్టులు కట్టేది కాంగ్రెసే
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
రాజశేఖర్ రెడ్డి పుణ్యాన పాలమూరు జిల్లాకు తాగునీరుతో పాటు సాగునీరు అందించాం
ఉమ్మడి పాలమూరు జిల్లా గొంతు కోసింది కేసీఆర్ రే
ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా 90%శాతం పనులు ఎలా పూర్తి అయ్యాయి అని ప్రశ్నించారు.
వనపర్తి
కృష్ణానది జలాలపై హాట్ హాట్ గా చర్చ జరుగుతుందని, కెసిఆర్ తప్పిదం వల్లే కృష్ణ నీటి వాటా లో నష్టం జరిగిందని చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
కృష్ణ గోదావరి జలాలపై బీఆర్ఎస్ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. కృష్ణానది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన నది, జల వనరుల గల నది అని అన్నారు. నది వాటాలలో బ్రజేష్ ట్రైబ్యనల్ అపెక్స్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 811 టీఎంసీలు నీళ్లు కాగా ఆంధ్ర ప్రాంతానికి 512 టీఎంసీలు నీళ్లు 299 టీఎంసీలు నీళ్లు తెలంగాణ ప్రాంతం వాళ్లు వాడుకునే వాళ్ళు అని అన్నారు. పరివాహక ప్రాంతం ప్రకారం 68% తెలంగాణ ప్రాంతం కాగా 32% ఆంధ్ర ,రాయలసీమ ప్రాంతంగా ఉంది అని తెలిపారు
జలదోపిడిని జీర్ణించుకోలేకనే తెలంగాణ సమాజం ఉద్యమం చేసి, సోనియా గాంధీ దయతో తెలంగాణ రాష్ట్రం సాధించామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు 2015 రెండవ ట్రైబ్యనల్ ఏర్పాటు చేశారని ఫస్ట్ ట్రైబ్యనల్ ముందు ఫస్ట్ అపెక్స్ మీటింగ్ లో 299 టీఎంసీలు నీళ్లు చాలు అని కెసిఆర్ సంతకం పెట్టారని అన్నారు.
68% పరివాహక ప్రాంతం ఉన్న ప్రకారం 555 టీఎంసీల కావాలి అని బాధించేది పోయి మా ప్రాంతానికి 299 టీఎంసీలే చాలు అని సంతకం పెట్టి మన ప్రాంతాన్ని ఎండ కట్టారని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి గారు 68% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది కాబట్టి మాకు 555 టీఎంసీలు కావాలని కొట్లాడుతున్నారని తెలిపారు.
2020 సంవత్సరంఅపెక్స్ కౌన్సిల్లో ఆంధ్ర సీఎం, కర్ణాటక సీఎం, మహారాష్ట్ర సీఎం, కేంద్ర జల వనరుల మంత్రి చైర్మన్ గా ఉంటారు. ఆ సమావేశంలో కేసీఆర్ 299 టీఎంసీలు మాత్రమే మా ప్రాంతానికి అవసరమని సంతకం పెట్టారని తెలిపారు. మహారాష్ట్ర జల వనరుల అడ్వైజర్ ఎదిరే శ్రీరామ్ గారు బిజెపి అధ్యక్షులు రామచంద్ర రావు ఈ మధ్య ప్రెస్ మీట్ లో టిఆర్ఎస్, కాంగ్రెస్ కృష్ణా జలాలపై తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని అంటున్నారు .ఎదిరే శ్రీరామ్ గారు తెలంగాణ ప్రాంత వాసి కాబట్టి తెలంగాణ ప్రాంతానికి 555 టీఎంసీల నీళ్లను అందించే విధంగా కృషి చేయాలని కోరారు.
మహబూబ్ నగర్ జిల్లాలో46 సంవత్సరాలు కాంగ్రెస్ రాజకీయాలలో ఉన్నానని తెలిపారు.1978 నుంచి విద్యార్థి నాయకుడిగా యూనివర్సిటీ నాయకునిగా ఇందిరాగాంధీ ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన ఇందిరా కాంగ్రెస్ లో చేరి ఇందిరాగాంధీ గారికి అండగా ఉంటూ రాజకీయం చేశామని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా విస్తీర్ణంలో రెండవ పెద్ద జిల్లా మరియు రెండవ అత్యల్ప వర్షపాతం గల జిల్లా కూడా మహబూబ్ నగర్ రే అని అన్నారు.1989 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని నియోజకవర్గంలో తిరగాలంటే త్రాగునీరు కోసం ఎవ్వరు ఏమీ అడుగుతారో అని భయపడే వాళ్ళమని అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కరువు వల్ల జిల్లా ప్రజలు వలసలు వెళ్లేవారని, పాలమూరు ప్రజలు నాగార్జున్ సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టారని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి ప్రాజెక్ట్ ఆర్డిఎస్ అని ప్రాజెక్టు నిర్మాణం నిజం ప్రభువు హయాంలోనే జరిగిందని అన్నారు. 1956 హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభించుకున్నామని తెలిపారు.1954 సంవత్సరంలో హైదరాబాదు రాష్ట్రంలోనే నేను జన్మించానని చిన్నారెడ్డి గారు తెలిపారు.1956 నుంచి 2014 వరకు ఆర్డీఎస్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అన్నారు.
ఆర్డీఎస్ 16 టీఎంసీలు లెవెల్ లక్ష 60 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంతో నిర్మించారని కానీ సాగుకు 8 టీఎంసీలు ,5 టీఎంసీలు వాడుకోలేదని 30 వేల ఎకరాలకు మించి సాగు జరగలేదని తెలిపారు.
రెండవ ప్రాజెక్ట్ జూరాల ప్రాజెక్టు: జూరాల ప్రాజెక్టు లెవెల్ 18 టీఎంసీలు కట్టవలసి ఉండే కానీ కర్ణాటక ముంపుకు గురవుతుందని 12 టీఎంసీలు లెవెల్ కు కుదించి కట్టారని, లక్ష 20 ఎకరాలకు నీరు ఇవ్వాలని కట్టారని తెలిపారు. 12 టీఎంసీలల్లో మూడు టీఎంసీలు పూడుకకు కావడంతో కేవలం 9 టీఎంసీలు నీళ్లు మాత్రమే నిల్వ ఉంటున్నాయని తెలిపారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ నాయకులకు ప్రాజెక్టులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారు కానీ పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయట్లేదు అని అసెంబ్లీలో ప్రశ్నించానని తెలిపారు.
భీమ ,నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లు పూర్తిచేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి దే అని అన్నారు.
పాలమూరు ప్రాజెక్టు లు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్ర ,కృష్ణ నీళ్లను బిందెలో పెట్టుకొని అలంపూర్ చివరి ప్రాంతం నుంచి పాదయాత్రతో హైదరాబాదుకు వెళ్ళామని ఆ సమయంలోఅలంపూర్, గద్వాల్, వనపర్తి, దేవరకద్ర, జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు పాదయాత్ర తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసినప్పుడు పాదయాత్ర చేస్తే ఆరోగ్యం బాగుంటుంది తప్ప ప్రాజెక్టులు పూర్తికావు అని అవహేళన చేశారని తెలిపారు. ఈమధ్య చంద్రబాబునాయుడు భీమ, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నేనే కట్టానని అనడం హాస్య స్పందమని అన్నారు. 2004 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంక 2005 సంవత్సరంలో బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లకు ఒక్కరోజే శంకుస్థాపన చేసి 15 వందల కోట్లు కేటాయించారని అన్నారు. కోయిల్ సాగర్ 30 వేల ఎకరాల నుంచి 50 వేల ఎకరాలకు పెంచాలని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరిగాయని, చనిపోయాక నిదానంగాపూర్తి అయ్యాయని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే 2011 సంవత్సరం వరకే అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి అని అన్నారు.2009- 2013 సంవత్సరాల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి మీద పాలమూరు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జీవో ఇచ్చారని, జూరాలకు అనుసంధానంగా చేసుకొని 32 వేల 500 కోట్లు 70 టీఎంసీలు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అంచనాతో జీవో ఇచ్చారని తెలిపారు.
కెసిఆర్ కు రాత్రి సమయంలో స్నేహితులు ఎక్కువ కాబట్టి నల్గొండ రిటైర్డ్ ఇంజనీర్ నల్గొండ జిల్లాకు సాగునీరు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో శ్రీశైలం దగ్గర నుంచి నల్గొండకు నీరు ఇవ్వాలని అక్కడ ప్రాజెక్టుకు కేసిఆర్ ఒప్పుకున్నారని తెలిపారు.
32 వేల 500 కోట్ల నుంచి 35 వేల కోట్ల కు పెంచారని దాదాపు 3 వేల కోట్లు అదనంగా పెంచారని తెలిపారు. ప్రాజెక్టు 90 టిఎంసిలు 12 లక్షల 30 వేల ఎకరాలకు అని అన్నారు.30వేల ఎకరాలు నల్గొండకు 2 లక్షల ఎకరాలు రంగారెడ్డికి 10 లక్షల ఎకరాలు పాలమూరుకు అనే విధంగా డిజైన్ చేశారని తెలిపారు.
2014 ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారని నేను అడిగాను . కెసిఆర్ పాలమూరు బిడ్డవేనా జూరాల చిన్న ప్రాజెక్ట్, శ్రీశైలం పెద్ద ప్రాజెక్ట్ అని నా నోరు మూయించారని తెలిపారు.
జూరాల నుండి శ్రీశైలానికి పోవడం వల్ల ఏం నష్టం జరిగిందంటే జూరాల బ్యారేజ్ మాత్రమే వరద నీరు ను గేట్ల ద్వారా అదిపి పట్టి ఎత్తిపోసుకోవడమే మంచిది అని తెలిపారు. మన మీద ఆధారపడే వాళ్లను మనం వాళ్ల మీద ఆధారపడే విధంగా అయ్యామని అన్నారు.
శ్రీశైలానికి చెందిన 12 గేట్లలో గేట్లు తెలంగాణ నాగర్ కర్నూల్C కి వస్తాయి. కానీ జగన్,కెసిఆర్ తో స్నేహం చేసి నీటి మొత్తాన్ని దిగువకు వదులుకున్నారని అన్నారు. 6గేట్లు మనకు ఉంటే మనకు సాగునీరు అందేది అని అన్నారు. నిన్న ప్రాజెక్టులు తిరిగిన వ్యక్తులను అడుగుతున్న 90% పూర్తి చేశామని అంటున్నారు కదా 35 వేల కోట్ల ఉంచి 55 వేల కోట్లకు పెంచారు కదా మీ ప్రభుత్వం దిగే సమయానికి 27 వేల కోట్లు మాత్రమే వాడుకున్నారు. అలాంటప్పుడు 90 శాతం పనులు ఎలా పూర్తి అవుతాయి అని ప్రశ్నించారు?.50% శాతంపనులు పూర్తి చేసి 90 %శాతం పనులు పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 90 శాతం పనులు పూర్తి చేశామని అంటున్నారు కదా 40% పనులకు ఎక్కడి ను…
