వ్యవసాయానికి అండగా నిలిచేదే విభి జి రామ్ జీ చట్టం
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్ గౌడ్, పెద్దిరాజు
వనపర్తి :
కాంగ్రెస్ 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గా చట్టం చేసి 2009లో ఎన్నికల కోసమే మహాత్మా గాంధీ పేరు చేర్చారని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత చట్టం స్థానంలో వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ అజీవికా మిషన్ గ్రామీణ(VB G RAM G) పేరు మాత్రమే మార్చడం జరిగిందని గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే మెరుగైన ఉపాధి కల్పిస్తూనే గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందిస్తుందని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్ గౌడ్దీ పెద్దిరాజులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గతంలో 100 రోజుల స్థానంలో 125 రోజుల ఉపాధి కల్పన, నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భత్యం, వేతనాలు ఆలస్యంగా చెల్లిస్తే అదనపు పరిహారం చెల్లింపు
గ్రామంలో చేయవలసిన పనులు కేంద్ర నిర్ణయిస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని గ్రామసభ గ్రామపంచాయతీ స్వయంగా తన గ్రామానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తాయి.
నూతన చట్టంలో నాలుగు ప్రధాన పనులు గ్రామసభ ద్వారా చేపడతారని అవి
- గ్రామీణ నీటి సంరక్షణ
- మౌలిక సదుపాయాల కల్పన3. జీవనోపాధి ఆధారిత పనులు మరియు
- విపత్తు నిర్వహణ నిర్వహణకు సంబంధించిన పనులు విబి జి రామ్ జి ద్వారా కొత్తగా చేర్చబడ్డాయి. దీని కింద చెరువులు చెక్ డ్యాములు స్టాఫ్ డ్యామ్, పాఠశాలలు ఆసుపత్రులు అంగన్వాడీలు రోడ్లు కాలువలు షెడ్లు లేదా ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు చేపట్టి పేద కుటుంబాల ఆదాయాన్ని పెంచే ఉపాధి కల్పన పనులకు తోడు రిటైనింగ్ వాల్స్ కట్టలు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు నిర్మించడం ద్వారా నీటి ఆదా జరిగి ప్రాథమిక మౌలిక సదుపాయాలు మెరుగై ఉపాధి ఆదాయం పెరుగుతుంది అదే సమయంలో ప్రకృతి వైపరీత్యాల నుండి గ్రామాలకు రక్షణ లభిస్తుంది.
స్వయం సహాయక సంఘాల సోదరీమణులకోసం నైపుణ్య కేంద్రాలు స్థాపించడం, షెడ్లను నిర్మించడం సంతలను ఏర్పాటు చేయడం ద్వారా మహిళల జీవనోపాధికి భద్రత కల్పించడం.
ఈ చట్టంలో అతి ముఖ్యమైన వ్యవసాయానికి సంబంధించిన అంశం 125 రోజుల ఉపాధి హామీ ఇస్తూనే విత్తులు నాట్లు పంట కోత సమయంలో వ్యవసాయ కూలీల డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో ఏడాదికి 60 రోజులపాటు ఉపాధి హామీ పనులను నిలిపివేసి వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటులో ఉండేలా చూస్తూ వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా గ్రామ ఆర్థిక వ్యవస్థ సమతుల్యంగా మెరుగుపడే విధానానికి అవకాశం కల్పిస్తుంది.
ఉపాదీహామీకి వెన్నుముక వంటి రోజ్ గార్ సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్ల శిక్షణ వేతనం పర్యవేక్షణ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన 6%నుండి 9% నిధులను కేటాయించడం ద్వారా పని నాణ్యత మెరుగై వారి పారితోషకం గౌరవేతనం సకాలంలో సముచిత రీతిలో చెల్లింపులు జరిగేలా నిర్ధారిస్తుంది. ఉపాధి హామీ పథకానికి సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) తప్పనిసరి చేస్తూ పని జరిగిన ప్రదేశాలలో సక్రమమా లేదా అక్రమమా సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకతను పెంచి అవకతవకలు పాల్పడితే రికవరీ విధానానికి భద్రత కల్పించడం జరిగింది.
వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అండ్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఆధునిక సాంకేతిక ద్వారా పని ప్రదేశాలలో బయోమెట్రిక్ హాజరు జిఐఎస్ ఆధారిత ధ్రువీకరణ మొబైల్ యాప్ ద్వారా పని కచ్చిత నిర్ధారణ.
2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పాత చట్టాన్ని కొనసాగిస్తూ వ్యవసాయానికి అత్యధిక మద్దతు పెంచి పాఠశాలలు ఆసుపత్రులు మౌలిక సదుపాయాల కల్పనకు సాంకేతికతను జోడించి గ్రామీణ పేదల జీవనోపాధి మెరుగుపరచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి అబద్ధ ప్రచారాలకు కేంద్రబిందువైన కాంగ్రెస్ను ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.
పాత్రికేయ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు పి శ్రీనివాస్ గౌడ్ పెద్దిరాజు జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి మాజీ ప్రధాన కార్యదర్శి అక్కల రామన్ గౌడ్ ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఆగపోగు కుమార్ జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి దంతోజు నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు
