- తుడ చైర్మన్ కు జిల్లా కలెక్టర్ స్పష్టం సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడ) ద్వారా చేపట్టే అభివృద్ధికి ప్రభుత్వ శాఖల ద్వారా అన్ని విధాల సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తుడా చైర్మన్ కు స్పష్టం చేశారు. “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం తుడా భివృద్ధిపై చర్చించారు. తుడా పరిధిలో చేస్తున్న అభివృద్ధి పనులను కలెక్టర్ కు వివరించారు. తుడా పరిధిలోని అన్ని నియోజకవర్గాల గ్రామాలు, పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తుడా చైర్మన్ కలెక్టర్ కు వివరించారు. అందుకు అవసరమయ్యే ఆదాయ వనరులపై దృష్టి సారించామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ తుడా అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తుడా చైర్మన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయడంలో సమిష్టి కృషి, సమన్వయం అవసరమని చర్చించుకున్నారు.
