సుపరిపాలనలో తొలి అడుగు.. పార్వతీపురంలో అభివృద్ధి సంకేతాలు

TEJA NEWS

పార్వతీపురం మ‌న్యం జిల్లా

సుపరిపాలనలో తొలి అడుగు.. పార్వతీపురంలో అభివృద్ధి సంకేతాలు

అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నాం

ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయ‌క‌త్వంలో ప్ర‌గ‌తి ప‌థంలో పయనం

అతివలకు ఆర్థిక భరోసా: రూ.49.75 కోట్లు చెక్కుల పంపిణీ, రైతులకు యంత్రాల అందజేత

స‌మ‌న్వ‌యంతో జిల్లాను అభివృద్ది ప‌ధంలో తీసుకెళ్దాం

మ‌న్యం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అభివృద్ధిలో అల్లూరి సీతారామరాజు జిల్లా తొలిస్థానం.. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా ద్వితీయ స్థానంలో ఉండ‌డం సంతోషం

కార్య‌క్ర‌మాల్లో పాల్లొన్న మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, కూట‌మి నాయ‌కులు

“సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అభివృద్ధి చర్యలకు వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మన్యం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి స‌మ‌న్వ‌యంతో జిల్లాను అభివృద్దిప‌ధంలో తీసుకెళ్దామ‌ని అన్నారు. అభివృద్ధిలో జిల్లా ద్వితీయ స్థానంలో ఉండ‌డం సంతోషంగా ఉంద‌ని అన్నారు. ప‌ర్యాట‌క రంగాన్ని మరింత‌గా అభివృద్ధి చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగ‌తుంద‌ని అన్నారు.

ఘన స్వాగతం… విశిష్ట హాజరు
పాలకొండ కూటమి నేతలు పి. భూదేవమ్మ, రామినాయుడు తదితరులు అచ్చెన్నాయుడుకు గారికి పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ శాఖాధికారులు, సబ్ కలెక్టర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అతివలకు ఆర్థిక భరోసా: రూ.49.75 కోట్లు పంపిణీ
మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.49.75 కోట్లు రుణం మంజూరు చేయగా, ఆయా చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. మహిళల అభివృద్ధి, కుటుంబ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని అన్నారు.

అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నాం
ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వేంట‌నే ఇచ్చిన హామీలను అమ‌లు చేశామ‌ని అన్నారు. పెన్షన్ రూ.4 వేలు పెంచామ‌ని, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన నియామ‌క ప్ర‌క్రియ త్వ‌ర‌లో పూర్త కానుంద‌ని అన్నారు. 203 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతూ… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామ‌ని చెప్పారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నామ‌ని, మత్య్సకారులకు వేట నిషేధ సమయంలో సాయం రెట్టింపు చేసి, రూ.20 వేలు ఇచ్చామ‌న్నారు. రైతుల‌కు 90% సబ్సిడీ‌పై డ్రిప్ ఇరిగేషన్ అంద‌చేస్తున్నామ‌ని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లు చేశామ‌ని, రాష్ట్రంలో సుమారు 67 ల‌క్ష‌ల మంది విద్యార్ధుల‌కు ఈ ప‌థ‌కం కింద త‌ల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్ల రూపాయిలు ప్ర‌భుత్వం జ‌మ చేసింద‌ని అన్నారు. ప‌ల్లెలు అభివృద్ధికి చెందేందుకు గ్రామీణ ర‌హ‌దారులు నిర్మాణం చేప‌ట్టం జ‌రిగింద‌న్నారు.

రైతులకు రాయితీ యంత్రాలు .. అన్నదాతకు అండ
రైతుల సంక్షేమాన్ని గ‌త ప్ర‌భుత్వం పూర్త‌గా ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. కూట‌మి ప్ర‌భుత్వం రైతుల శ్రమ తగ్గించేందుకు, వ్యవసాయంలో యాంత్రీకరణను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు అందజేశారు. రైతుల శ్రమను గౌరవించేందుకు ప్రభుత్వం ప్రతిపదికగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మ‌రించింద‌ని ఆరోపించారు. పొగాకు, మామిడి, కోకో, మిర్చి పంట‌ల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర‌ను అంద‌చేసి రైతుల‌కు కొండంత అండ‌గా నిలిచామ‌న్నారు. రైతులు అమ్ముకున్ పంట‌కు సంబంధించిన న‌గ‌దును 48 గంట‌ల‌లోపే జ‌మ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని అమ‌లు చేసి రైతుల‌కు న‌గ‌దును అంద‌చేస్తామ‌ని హ‌మీ ఇచ్చారు.

జిల్లాలో ఉద్యాన పంటల సాగు అధికంగా ఉంద‌ని, పండించిన పంటలకు మంచి ధర రావాలంటే పంట‌లో క్వాలిటీ మెరుగ్గా ఉండాల‌న్నారు. అటవీ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకి ప్రణాళిక లు చేస్తున్నామ‌ని, గిరిజన ప్రాంతంలో జీవ‌నం అధికంగా ఉందని, పాలకొండ ప్రాంతంలో పైనాపిల్ పంట అధికంగా సాగు చేస్తున్నారు కాబ‌ట్టి వీటికి బై ప్రొడక్ట్స్ తీసుకు రావాల్సిన అవసరం గుర్తించామ‌ని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు. గిరిజన ప్రాంతంలో సరైన రహదారులు లేక డోలిమోతలతో ఇబ్బందులు ప‌డటం గమనించి రహదారి సౌకర్యాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. 270 గ్రామాలకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా ప్రతినిధులు స‌హ‌కారంతో 110 గ్రామాలకు రహదారులు వేయడం జరిగిందన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా రహదారుల ఏర్పాటుకు ప్రత్యేకత చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని అన్నారు. జంజావతి ప్రాజెక్టు రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా 15,000 ఎకరాలకు సాగు నీరు అందించేలా ఒరిస్సా గవర్నమెంట్ తో చర్చించేందుకు శ్రద్ధ చూపుతామ‌ని వెల్ల‌డించారు.కార్యక్రమంలో ఐటిడిఎ అధికారులు అశుతోష్ శ్రీవాస్తవ్, సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు: పిఆర్వో, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక , మత్స్యశాఖ మంత్రి

You cannot copy content of this page

Scroll to Top