జీవనశైలిలో మార్పులతోనే ఆరోగ్యం

TEJA NEWS

జీవనశైలిలో మార్పులతోనే ఆరోగ్యం

** బిఎన్ కండ్రిగ వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి

శ్రీకాళహస్తి:
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, క్యాన్సర్ పట్ల ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం ద్వారా వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని బుచ్చినాయుడు కండ్రిగ వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో బిఎన్ కండ్రిగ పి.హెచ్.సి పరిధిలోని ఎన్పి కోట, ఆళత్తూరు గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి.

బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.
స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో వైద్యాధికారి డాక్టర్ ఉదయకుమార్, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ చైతన్య భాను, సర్పంచులు ఎ.విద్యానాథరెడ్డి, పి.చంద్రారెడ్డి, కార్యదర్శులు జి.రవికుమార్, పెంచలయ్య, సిహెచ్ వోలు వెంకటేశ్వర్లు, ఎం.అనూష, టి.సుప్రజ, ఏఎన్ఎంలు పి.గౌరి, ఎన్.కుసుమ కుమారి, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top