యువతలో క్రీడోత్సాహం పెరిగింది** “శాప్” చైర్మన్ ను అభినందించిన ఎమ్మెల్యే

TEJA NEWS

యువతలో క్రీడోత్సాహం పెరిగింది
** “శాప్” చైర్మన్ ను అభినందించిన ఎమ్మెల్యే

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ గా నియమితులైన అనిమిని రవినాయుడు రాకతోనే రాష్ట్రంలోని యువకుల్లో క్రీడోత్సాహం పెరిగిందని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు అన్నారు. రవినాయుడు జన్మదినోత్సవ వేడుకలు తిరుపతిలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. ఈ సందర్భంగా తిరుపతి నుంచి కరకంబాడీ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో తిమ్మినాయుడు పాలెం ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో జన్మదిన సంబరాల వేదిక ఏర్పాటు చేశారు. విద్యార్థి నాయకుడుగా కొనసాగిన దశనుంచి రవినాయుడుకు ఆత్మీయంగా మెలిగిన స్నేహితులు, ఎస్వీయూ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ అధికారులు, సిబ్బందితో పాటు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై శాప్ చైర్మన్ కు బొకేలు ఇస్తూ…. శాలువాలు కప్పి సన్మానం చేశారు. రవినాయుడుని పైకి ఎత్తుకుని జై స్టూడెంట్ లీడర్…. జై టీడీపీ….. అంటూ నినాదాలు చేసి సంబరాలు చేశారు. శుభాకాంక్షలు చెప్పినవారిలో బీజేపీ అధికార ప్రతినిధి గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఊకా విజయ్ కుమార్, నవీన్ కుమార్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, దంపూరి భాస్కర్, తెలుగు మహిళా నాయకురాళ్లు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు గుండాల గోపినాధ్, వరప్రసాద్, కిరణ్ రాయల్, పెద్ద సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top