జీవ వనరుల కేంద్రం వద్ద బయోచార్ తయారీపై గిరిజన రైతు మహిళలకు అవగాహన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
అశ్వరావుపేట మండలం పండు వారి గూడెం గ్రామంలో, జీవ వనరుల కేంద్రం వద్ద బయోచార్ తయారీపై గిరిజన మహిళ రైతులకు జీవా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు.పర్యావరణ పరిరక్షణకు బయోచార్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు . మొక్కలకు బయోచార్ ఉపయోగిస్తే భూసారం పెరుగుతుందని వివరించారు.రసాయన ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వలన భూసారం కోల్పోతుందన్నారు.
