జిల్లాలో రోటా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో కొత్తగా ప్రారంభించబడిన రోటా సీల్ 2 డోసుల వాక్సిన్ పంపిణి కార్యక్రమం నుండి ప్రారంభిస్తున్నట్లు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. కోటిరత్నం తెలిపారు. ఈ వాక్సిన్ ప్రత్యేక కిట్ లో వస్తుందని ఆ కిట్ లో ఒక 4ఎం. ఎల్. వాయల్ , ఒక అడాప్టర్ మరియు రెండు 3ఎం. ఎల్ . సిరంజి లు వస్తాయని తెలిపారు . ఒక బిడ్డకు 2ఎం.ఎల్. చొప్పున మొత్తం ఇద్దరికీ వాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. తీవ్ర నీళ్ల విరోచనాలు , వాంతుల నుంచి కాపాడే రోటా సీల్ వాక్సిన్ ను బిడ్డ పుట్టిన 6, 10 మరియు 14 వారాల వయస్సులో ఇవ్వాలనిసూచించారు.
