రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం

TEJA NEWS

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పూర్తిగా మోసం చేసినది రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి మైనారిటీ. బాజీ బాబా.

పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో నైజాం గేట్ సెంటర్.మైనారిటీకార్యాలయంలో*బాజీ బాబా మాట్లాడుతూ.ఎన్నికల సమయంలో ముస్లింలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ముస్లిం సమాజాన్ని తీవ్రంగా నిరాశపరిచింది.

ఎన్నికల ముందు ఎంతో ఘనంగా ప్రకటించిన షాది తోఫా పథకం ఎక్కడుంది? ముస్లింయువతులవివాహాలకుఆర్థికసహాయంఅందిస్తామని చెప్పి చివరకు మాట తప్పింది కూటమి ప్రభుత్వం.
ముస్లిం యువతకుఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, జాబ్.మేళాలునిర్వహిస్తామని, స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి మరోసారి మోసం చేస్తున్నారు. ఎంతో ప్రచారం చేసిన జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? యువతకు ఇచ్చిన ఆ హామీ ఎందుకు అమలు కావడం లేదు
ముస్లిం బిడ్డలకు అందాల్సిన తల్లికి వందనం పథకం మొదటి ఏడాది డబ్బులు ఎక్కడికి వెళ్లాయి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ముస్లిం అక్కాచెల్లెమ్మలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు ₹1500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? నిరుద్యోగ యువతకు నెలకు ₹3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసింది ఈ ప్రభుత్వమే కాదా
ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న ముస్లిం సోదరులకు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు స్థలం అయినా ఇచ్చారా? ముస్లిం కుటుంబాలకు కాలనీ ఇళ్లు ఎక్కడ ఉన్నాయి
ముస్లిం సోదరులు, సోదరిమణులకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు కొత్తగా ఒక్కటి అయినా ఇచ్చారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆ హామీ ఎందుకు అమలు చేయడం లేదు
ముస్లింమైనారిటీసోదరులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ హామీనిపూర్తిగామరిచిపోయింది కూటమిప్రభుత్వం.


ఉర్దూ స్కూళ్ల సంఖ్య పెంచుతామని చెప్పి, ప్రస్తుతం ఉన్న స్కూళ్లను కూడా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.
ఇవన్నీ పక్కనబెట్టి నేడు ఇఫ్తార్ విందులు ఇచ్చి ముస్లిం సమాజానికి అన్నీ చేస్తున్నామన్నట్లు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం గత వైసిపి ప్రభుత్వంలోమాఅధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు గుండెలకు హత్తుకునే మహోత్తరమైన పథకాలుఅమలుపరిచారని విజయవాడపశ్చిమనియోజకవర్గంమాజీమంత్రివర్యులు వేల్లంపల్లిశ్రీనివాస్.రావు వందలాదికోట్లరూపాయలతోపశ్చిమనియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచారు అని. బాజీబాబా. కొనిఆడినారు
ముస్లింమైనారిటీసోదరులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని కూటమిప్రభుత్వాన్నిమేము*గట్టిగా డిమాండ్ చేస్తున్నాము

You cannot copy content of this page

Scroll to Top