సంపన్నులు పీ-4లో భాగస్వాములై, రాష్ట్ర అభివృద్ధి

TEJA NEWS

సంపన్నులు పీ-4లో భాగస్వాములై, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి : మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి

  • విద్యార్థులతో పాటు పేదలకు చేయూతనివ్వడంపై ధనవంతులు దృష్టి సారించాలి : ప్రత్తిపాటి
  • ఒయాసిస్ వెల్ఫేర్ ఆసోసియేషన్ సభ్యులు పీ-4లో పాలుపంచుకోవాలి : ప్రత్తిపాటి.

ఆర్థికంగా ఉన్నతస్థానాల్లో ఉన్న వారందరూ, తమ సంపాదనతో ఎలాంటి ఆదరువు లేని పేదల్ని ఆదుకోవాలని, అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ-4కు సార్థకత చేకూరుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్తిపాటి బుధవారం నగదు బహుమతులు అందచేశారు. పట్టణంలోని పండరీపురంలో కే.జే హాస్పిటల్లో మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కందిమళ్ల జయమ్మ ఆధ్వర్యంలో, ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజింగ్ సభ్యులు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాటి, నిర్వాహకులు… విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే దాతలు… పేదల జీవితాలపై కూడా దృష్టిపెట్టాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీ-4లో భాగస్వాములై సమాజానికి మేలు చేయాలని ప్రత్తిపాటి సూచించారు.

డబ్బు.. పలుకుబడి ఉన్నవారు పేదల ఉన్నతికి పాలుపడితే, సమాజం త్వరితగతిన వృద్ధి చెందుతుందని, తద్వారా వారు పరోక్షంగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడినట్టేనని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. మంత్రి లోకేశ్ చేపట్టిన షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ లో భాగంగా పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం సంతోషంగా ఉందని ప్రత్తిపాటి చెప్పారు. చిన్నవయసు నుంచే విద్యార్థులు తమ లక్ష్యసాధన కోసం ప్రయత్నించాలని, సరైన ప్రణాళిక, మంచి ఆలోచనతో, నిష్ణాతులైన గురువుల మార్గదర్శకత్వంలో తాము అనుకున్నది సాధించాలని ప్రత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో 21 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున లక్షా5వేల నగదును ప్రత్తిపాటి అందించారు. ఒయాసిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను పేరుపేరునా అభినందించిన ప్రత్తిపాటి. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో కారుమంచి శివరావు, కరణం విజయ లక్ష్మీ, మారెళ్ళ ఇందిరా, ఒయాసిస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top