యువ రైతు మృతి: కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్‌పీ నాయకులు

TEJA NEWS

యువ రైతు మృతి: కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్‌పీ నాయకులు

సూర్యపేట జిల్లా : సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల పరిధిలోని వట్టి కాంపాడ్ గ్రామానికి చెందిన యువ రైతు వీరబోయిన సైదులు యాదవ్ (32) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల సందర్భంగా విద్యుత్ షాక్ తగలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ వట్టి కాంపాడ్ గ్రామానికి వెళ్లి మృతుడైన వీరబోయిన సైదులు యాదవ్ పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, ఆత్మకూరు (ఎస్) మండలాధ్యక్షుడు బొల్లె సైదులు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రైతు కుటుంబానికి ప్రభుత్వంచే తగిన సహాయం అందించాలని కోరుతున్నారు.

You cannot copy content of this page

Scroll to Top