వి.ఎస్.ఎస్.ఎస్ ట్రెజరర్ ఇందారపు సునీత కు భారతీయ నారిశక్తి ఇంటర్నేషనల్ అవార్డు ప్రధానం…..
పెద్దపల్లి/ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, సికింద్రాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ విద్య నగర్ లోని, సిటీ కల్చరల్ ఆడిటోరియంలో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఆడిటోరియంలో, మంగళవారం సాయంత్రం మన చేయూత స్వచ్ఛంద సంస్థ, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి భారతీయ నారీశక్తి జాతీయస్థాయి అవార్డును సునీత ఇందారపు కు స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఫౌండర్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్, ఏషియన్ వేదిక్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల మంజుల, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్, చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్,వందే భారత్ సేవ్ ఇండియా మూవీ డైరెక్టర్ డాక్టర్ మల్లం రమేష్, స్పూర్తి సర్వీసెస్ సొసైటీ ప్రతినిధులు, ఇండియన్ ఎన్జీవో చీఫ్ అడ్వైజర్ జిహెచ్ఎంసి బీజేపీ నాయకుడు గూడూరు శ్రీధర్ రెడ్డి, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయ సెక్రటరీ డాక్టర్ కాశీ విశ్వనాథ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ సరిత మాలో ప్రముఖుల చేతుల మీదుగా అందించడం జరిగింది.
అనంతరం సునిత మాట్లాడాతూ.. గత 16 సంవత్సరాలు గా మన చేయూత స్వచ్ఛంద సంస్థ, అధ్యక్షురాలుగా, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ట్రెజరర్ గా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో సేవలు అందిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అమె తెలిపారు.
తను చేస్తున్న సేవలను గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని. తనకు భారతీయ నారి శక్తి ఇంటర్నేషనల్ అవార్డు ఆనందంగా ఉందన్నారు.
ఈ అవార్డును
అందించిన సంస్థ బాధ్యులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అని తెలిపారు. అవార్డును తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నానని తెలిపారు.
