టీటీడీ చైర్మన్ – ఈఓకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు

TEJA NEWS

టీటీడీ చైర్మన్ – ఈఓకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు

తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టీటీడీ ఛైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బిఆర్) నాయుడు, ఈఓ ఎం. రవిచంద్రలకు టీటీడీలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు… కృతజ్ఞతలు తెలిపారు. ఆమేరకు టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు గోల్కొండ వెంకటేశం, నైనార్ పద్మనాభం, వెంకటముని రాజు, మునికిరణ్ కుమార్, శివ, గంపల వెంకటరమణా రెడ్డి, జాటోత్ భాస్కర్, మేడికొండ ప్రసాద్ రావు, వి.రామచంద్ర యాదవ్, వాసు, ఎల్ఎన్వీ రవికుమార్, రాజకుమార్, మహేష్ తదితరులు తిరుమల అన్నమయ్య భవన్ లో చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, జేఈఓ, టీటీడీ బోర్డు సభ్యులను కలసి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ
టీడీడీ ఎంప్లాయిస్ హెల్త్ ఫండ్ లో పెండింగ్ లో సుమారు 600 మెడికల్ బిల్లులు రింబర్స్మెంట్ కు ఆమోదం చెప్పడం హర్షనీయం అన్నారు.


3 లక్షల నుండి 5 లక్షల వరకు మెడికల్ రియంబర్స్మెంట్ కు అంగీకారం ఇఓకి అధికారం ఉండగా 5లక్షలు దాటితే పాలకమండలి ఆమోదం తో చెల్లిస్తారు. అలాగే ఈహెచ్ఎస్ ఫండ్ కు ఏటా 25 కోట్లు టీటీడీ నుండి కేటాయింపునకు అంగీకారం చెప్పారని తెలిపారు.
ఇంటి స్థలాల అభివృద్ధి పనులకు టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాలతో ఎక్సపెర్ట్స్ కమిటీ ( టీటీడీ ఉన్నతాధికారులు, టిటిడి బోర్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు) తో ఏర్పాటు చేసి తొందరగా అభివృద్ధి పనులు చేపడతామని టీటీడీ పాలకమండలి నిర్ణయం.
టీటీడీ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ , కార్పొరేషన్ ఉద్యోగులకు స్వామివారి దర్శనం, టీటీడీ గుర్తింపు కార్డు, వైద్య సదుపాయంతో పాటు లడ్డు కార్డు కల్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడమైనది. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మంచి సదుపాయాలు కల్పిస్తు నిర్ణయాలు తీసుకొన్నందుకు టీటీడీ ధర్మ కర్తలి మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడుకి, బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డికి, భాను ప్రకాష్ రెడ్డికి, పనబాక లక్ష్మికి, ఇతర బోర్డు సభ్యులకు , టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరికి, జేఈఓ వీరబ్రహ్మం, శరత్ లకు, టీటీడీ ఉన్నతాధికారులకు, అధికారులకు, టీటీడీ ఉద్యోగ సంఘాలు అభినందనలు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top