గణపవరం క్వారీలో మృతి చెందిన వ్యక్తి గుర్తింపు ఫిట్స్ కారణంగా జల సమాధి
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని క్వారీలో ఇటీవల మృతి చెందిన వ్యక్తిని నాదెండ్ల పోలీసులు గుర్తించారు, మృతుడు వేలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
నాదెండ్ల ఎస్సై పుల్లారావు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతి చెందిన వ్యక్తి చేపలు పట్టడానికి గణపవరం క్వారీకి ఒక్కడే వచ్చారు, మృతుడికి ఫిట్స్ ఉన్నట్లు వారి బంధువులు తెలిపారు ప్రమాదవశాత్తు చేపలు పడుతుండగా ఫిట్స్ రావడంతో అదుపుతప్పి నీళ్లలో పడి మృతి చెంది ఉంటాడని ఎస్సై పుల్లారావు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
