వై.ఎస్. జగన్ వెన్నుపోటు దినం అని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు

TEJA NEWS

వై.ఎస్. జగన్ వెన్నుపోటు దినం అని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట : పట్టణంలోని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు, వివరణాత్మక చర్యలతో సహకరించాలని, పాలక పక్షానికి మంచి సలహాలు ఇవ్వాలనే కనీస ఆలోచన లేకుండా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిరసనలు చేపట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటే, జగన్ ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏ వర్గానికి నష్టం వాటిల్లిందని జగన్ ‘వెన్నుపోటు దినం’ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారో ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర పురోగతికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, నిర్మాణాత్మక విమర్శలు, సలహాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. అనవసర నిరసనలతో ప్రజలను గందరగోళానికి గురిచేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top