హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని వెస్టర్న్ హిల్స్ సొసైటీ అడ్డగుట్ట కాలనీ రోడ్ నెంబర్ 11

TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని వెస్టర్న్ హిల్స్ సొసైటీ అడ్డగుట్ట కాలనీ రోడ్ నెంబర్ 11 లో నూతనంగా నిర్మిస్తున్న సెవెరేజ్ పైప్ లైన్ పనులను జలమండలి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో, కాలనీ వాసులతో కలసి పరిశీలించిన తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పాత సెవెరేజ్ పైప్ లైన్ స్థానంలో నూతనంగా 300 డైయా పైప్ లైన్, మ్యాన్ హోల్స్ నిర్మాణం చేపట్టామని చెప్పడం జరిగింది, అలానే ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,  అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top