వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి సమీక్షా సమావేశం
ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్న సందర్భంగా, ఈ పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది.
ఈ సమీక్షా సమావేశం తిరుపతి నగరంలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయం నందు, ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకుల సమక్షంలో జరిగింది.
పర్యటన సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ప్రజా సమావేశాలు మరియు రైతుల సమస్యలపై చర్చలు ఈ సమావేశంలో గంభీరంగా కొనసాగాయి.
అధినేత పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా నాయకులు, కార్యకర్తలు సంపూర్ణంగా సంయుక్తంగా రావాలనికోరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సిపి రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , మాజీ టీటీడీ చైర్మన్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు భూమాన కరుణాకర్ రెడ్డి , మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా , మాజీ డిప్యూటీ సీఎం .నారాయణ స్వామి , ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం , జడ్పిటిసి శ్రీనివాసులు , చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప , మాజీ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, రాజేష్ , సునీల్ , వెంకట గౌడు , భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
