సాల్మన్ హత్యను ఖండిస్తూ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన

TEJA NEWS

సాల్మన్ హత్యను ఖండిస్తూ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన

పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ,

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో దళిత నాయకులపై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై హత్యా రాజకీయాలు సాగుతున్నాయి” అని తీవ్రంగా మండిపడ్డారు.

గురజాల నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ హత్య దీనికి నిదర్శనం.

వినుకొండలో రసీద్ హత్య జరిగింది. ఇంకా ఎన్ని హత్యలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు?” అని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై దాడులు, బెదిరింపులు పెరిగాయని, బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామం నుంచి వందలాది కుటుంబాలు తమ ఊర్లను విడిచి గుంటూరుకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

“చివరికి ఒక దళితుడు అయిన సాల్మన్ మృతదేహానికి అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా గ్రామంలోకి వెళ్లకుండా అంక్షలు విధించడం దుర్మార్గం. మీకు ఏమైనా ఉంటే మా జోలికి రండి. మా కార్యకర్తల జోలికి వెళ్లి మీకు ఏం సాధిస్తారు?” అంటూ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సాల్మన్ గారి కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని బొల్లా బ్రహ్మనాయుడు గారు స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని , పార్లమెంట్ పరిశీలకులు పూనరి గౌతమ్ రెడ్డి , గురజాల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి , సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి , మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ సెల్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top