
కల్తీ చేస్తే కఠిన చర్యలు.. డీసీపీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరిక
Mar 20, 2026,
కల్తీ చేస్తే కఠిన చర్యలు.. డీసీపీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరిక
నగరంలో పెరుగుతున్న ఆహార కల్తీని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందుకోసం హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST)ను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందంలో 32 మంది టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఉంటారని, వీరు జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి నగరవ్యాప్తంగా జాయింట్ రైడ్స్ నిర్వహిస్తారని టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ తెలిపారు. ముఖ్యంగా పాలు, నాన్-వెజ్ వంటి వాటిల్లో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, పదే పదే పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కల్తీ ఆహారంపై సమాచారం ఉంటే 8712661212 నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.