బీసీఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శిగా బోల్లెద్దుల కృష్ణయ్య నియామకం
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన
బొల్లెద్దుల కృష్ణయ్య కు బి సి ఎఫ్ కండువాను రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్నా రాములు కప్పి పార్టీ లోకి ఆహ్వానిస్తూ . ఈ మేరకు ఆయన కు బిసిఎఫ్ జిల్లా కార్యదర్శిగా నియామకపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయానికి గురి అయిన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ అధికారికంగా జీవో ఇవ్వకపోవడం బాధాకరం . ఒకవేళ జీవో ఇచ్చిన చట్టబద్ధంగా పరిగణించబడదు కాబట్టి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధమైన రిజర్వేషన్ వచ్చేవరకు దేశవ్యాప్తంగా బీసీలు పోరాటం చేయాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు . బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని, మహిళా బిల్లును సవరించి 33 శాతం నుండి 50 శాతానికి పెంచి జనాభా దామాషా ప్రకారం కుల వర్గీకరణ చేసి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అమడబాకుల రామన్ గౌడ్ మాజీ ఎంపిటిసి , ఏర్పుల తిరుపతిలు పాల్గొన్నారు.
