నిపుణులైన నీటి శృద్ధి కరణ పరిస్కారం షాప్‌ను ప్రారంభించిన మనాలి ఠాకూర్…

TEJA NEWS

నిపుణులైన నీటి శృద్ధి కరణ పరిస్కారం షాప్‌ను ప్రారంభించిన మనాలి ఠాకూర్…

పెద్దపల్లి//గోదావరిఖని: . రామగుండం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కళ్యాణ్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “నిపుణులైన నీటి శృద్ధి కరణ పరిస్కారం” షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ రిబ్బన్ కట్ చేసి షాప్‌ను అధికారికంగా ప్రారంభించి, వ్యాపారానికి శుభారంభం కలిగించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మనాలి ఠాకూర్, స్వచ్ఛమైన తాగునీటి అవసరం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఇలాంటి వాటర్ పూరీఫైర్ సెంటర్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.

అలాగే షాప్ నిర్వాహకుడు నల్ల వినోద్ కి శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారంలో మరింత పురోగతి సాధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రాంతీయ ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top