పేదవాడి గౌరవ ప్రదమైన ఇంటి కల సాకరం1వ. డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్లు కు ముగ్గు పోసిన కార్పొరేటర్ మడిపెల్లి విజయ- మల్లేష్…

TEJA NEWS

పేదవాడి గౌరవ ప్రదమైన ఇంటి కల సాకరం1వ. డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్లు కు ముగ్గు పోసిన కార్పొరేటర్ మడిపెల్లి విజయ- మల్లేష్….

పెద్దపల్లి : రామగుండం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకం ధ్వార లబ్దిపొందిన కుటుంబాలకు, గౌరవప్రదమైన నివాసం కల్పించుటకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శ్రీకారం చుట్టగా, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ -మల్లేష్ పీకే రామయ్య కాలనీ లో నూతన ఇల్లా నిర్మాణం కోసం భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు.

ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నిజం చేయుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఎంతో మంది నిరాశ్రయులకు స్థిర నివాసం లభిస్తుందని,రామగుండం కార్పొరేషన్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ అన్నారు.

ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని,పేద ప్రజల సంక్షేమానికి ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ ముందు నుండి ఎంతో కృషి చేస్తున్నారని, వారు కృషికి ప్రజలు ఏకగ్రీవంగా గెలిపించడం అని ప్రతి కార్పోరేటర్ కానీ నాయకుడు కానీ ప్రజల సంక్షేమాన్ని గుర్తించినట్లయితే తప్పక మడిపెల్లి విజయ మల్లేష్ లాగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, గెలుపు సుగమము అవుతుందని పలువురు ఆకాక్షించారు.

నూతన ఇల్లు మంజూరు అయినా లబ్దిదారులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు, ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ- మల్లేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గుర్రాల మల్లేష్ యాదవ్ తో పాటు స్థానికులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top