తిరుమలకుంట లో ప్రకృతిని పులకించే విధంగా భూమి పండుగ వేడుకలు

TEJA NEWS

తిరుమలకుంట లో ప్రకృతిని పులకించే విధంగా భూమి పండుగ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం.

తిరుమలకుంట గ్రామం లో, ఆదివాసీ గిరిజనుల పండుగ గా భూమి పండుగను జరుపుకుంటారు.గిరిజనులందరూ కలసి ఒక స్థలమును ఏర్పాటు చేసుకొని ఆ, స్థలములో భూమి పూజకు సంబంధించిన పూజ, సామాగ్రి అలాగే మూడు రోజులు జరిగే ఈ పండుగకు సంబంధించిన. వంట సామాగ్రి మొత్తాన్ని, ఒకచోట ఏర్పాటు చేసుకొని గిరిజన సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ ప్రదేశంలో వంట ఏర్పాటు చేసుకొని, ఆట పాటలతో గిరిజన నృత్యాలతో, ఆదివాసి పాటల ను పడుకుంటూ, పల్లె ప్రకృతి పులకరించే విధంగా, సంతోషాల తో భూమి, పండుగను జరుపుకుంటారు. పండుగ జరుపుకోవడానికి గల కారణం కొత్తగా జూన్ నెల నుంచి వర్షాకాలం ప్రారంభం, కావడం అలాగే వ్యవసాయ సంబంధించి పాడి పంటల కోసం తొలకరి లో జరుపుకునే పండుగ గా చెప్పుకోవచ్చు. వారి ఆచారం ప్రకారం ఇలాంటి భూమి పండుగ జరుపుకోవడం, వలన పంటలలో దిగుబడి ఎక్కువ వస్తుందని. చేసిన వ్యవసాయం లాభాలతో ముందుకు సాగుతుందని నమ్మకం.

You cannot copy content of this page

Scroll to Top