బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
వనపర్తి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ లు బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ శ్రేణులు అమరవీరులకు నివాళులు,తెలంగాణ తల్లికి పూలమాలలు సమర్పించారు నాయకులు కార్యకర్తలు అవతరణ దినోత్సవ కేకు కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కె.సి.ఆర్ ఆంధ్రపాలకుల బానిస పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం 14ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రన్నీ సాధించారని
రాష్ట్రన్నీ సాధించడమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణ మాఫీ ,కె.సి.ఆర్ .కిట్టు,ఆసరా పింఛన్లు,కళ్యాణ లక్ష్మి,వంటి సంక్షేమ పథకాలతో పాటు విద్యా వైద్యం,సంక్షేమం కోసం 11వందల గురుకుల పాఠశాలలు,నూతన జిల్లాలతోపాటు కలెక్టరేట్ కార్యాలయాలు,జిల్లాలలో మెడికలు కాలేజీలు సాధించి భారతదేశ చరిత్రలో తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత కె.సి.ఆర్ ది అని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ పాలన అంతా తిరోగమనంలో కొనసాగుతుందని,సంక్షేమ పథకాలు అన్ని కూడా నిర్వీర్యం అయినాయి అని తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లాలంటే మళ్ళీ కె.సి.ఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.
కె.సి.ఆర్ పాలనలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి * నియోజకవర్గాని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని లక్ష ఎకరాలకు సాగునీరు అందించి రైతును రాజుగా చేసిన ఘనత *మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి దక్కుతుందని,దశాబ్దాల కల రోడ్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, ఐ.టి టవర్, జె. ఎన్.టి.యు కాలేజ్, అగ్రికల్చర్ కళాశాల,ఫిషరీస్ కళాశాల,మెడికల్ కాలేజ్,మాత శిశు సంరక్షణ కేంద్రం వంటి అనేక అభివృధి పథకాలు సాధించారని నేడు నియోజకవర్గం అభివృద్ధి లేక ఆగం అయిందని విమర్శించారు.
ఈ కార్యక్రమములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్, పి.రమేష్ గౌడ్,నందిమల్ల. అశోక్,గంధం.పరంజ్యోతి,కురుమూర్తి యాదవ్,మండల పార్టీ అధ్యక్షులు వనం.రాములు,వెంకటస్వామి,దిలీప్ రెడ్డి, బొల్లెద్దుల.బాలరాజు, మతీన్, చంద్రశేఖర్,కర్రేస్వామి,రఘుపతి రెడ్డి,మల్లారెడ్డి,రఘువర్ధన్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి,ధర్మా నాయక్, జాతృ నాయక్,గులాం ఖాదర్ ఖాన్,చిట్యాల.రాము,సూర్యవంశం.గిరి, జోహేబ్ హుస్సేన్,మాజీ కౌన్సిలర్స్,బండారు.కృష్ణ, నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్,కంచె.రవి,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,సింగిల్ విండోమాజీ అధ్యక్షులు విజయ్ కుమార్,బాను ప్రకాష్ రావు,జగన్నాథం నాయుడు,నాయకులు, ఉస్మాన్,ఎర్ర.శ్రీను,జహంగీర్,ఇమ్రాన్, సయ్యద్.జమీల్,నందిమల్ల.రమేష్ ఫజల్,శ్యాం,పెద్దముక్కుల. రవికుమార్,మోహన్ నాయి,ఖాదర్,అరుణ్ యాదవ్,బాగ్యరాజ్,అఖిలేందర్ తదితరులు పాల్గొన్నారు.
